నవతెలంగాణ – అమరావతి: ఏపీలో మెగా డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చారు. డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు పార్ట్2 కింద సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయడం ఇప్పుడు ఐచ్ఛికమని తెలిపారు. అయితే, పత్రాల ధ్రువీకరణ సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు. డీఎస్సీ అర్హత కోసం గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్కుల ప్రమాణాలు టెట్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో ముఖ్యమైన విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని మంత్రి సూచించారు. అలాగే అంకితభావంతో చదివి ఈ డీఎస్సీలో అభ్యర్థులు విజయం సాధించాలని మంత్రి లోకేశ్ కోరారు.
డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియలో మరో కీలక అప్‌డేట్
- Advertisement -