Saturday, July 12, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీలో కూలిన మ‌రో బహుళ అంత‌స్తుల భ‌వ‌నం

ఢిల్లీలో కూలిన మ‌రో బహుళ అంత‌స్తుల భ‌వ‌నం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదారాబాద్‌: దేశ రాజధాని ఢిల్లీలో మ‌రో బ‌హుళ‌ అంత‌స్తుల భ‌వ‌నం కూలిపోయింది. ఇవాళ ఉదయం నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని జనతా మజ్దూర్ కాలనీలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అందులో నివాసం ఉండే వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ ఇప్పటి వరకు నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అసలు బిల్డింగ్ కూలిన సమయంలో అందులో ఎంతమంది ఉన్నారు.. ప్రాణనష్టంపై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

ఏప్రీల్ 19న ఢిల్లీ లోని ముస్తాఫాబాద్ ఓ నివాస భ‌వ‌నం కూప్ప‌కూలి..ఒకే కుటుంబానికి చెందిన 11మంది శిథిలాల కింద‌ప‌డి మృతి చెందారు. 11 మందికి తీవ్ర‌గాయాలైన విష‌యం తెలిసిందే. ఆ ప్ర‌మాద స‌మ‌యంలో మొత్తంలో ఇంట్లో మొత్తం 22మంది ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -