- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో మాంజా మరో ప్రమాదానికి కారణమైంది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సాయివర్ధన్ రెడ్డి మెడకు మాంజా తగిలి లోతైన గాయం అయింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మాంజా వల్ల వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



