- Advertisement -
నవతెలంగాణ విశాఖపట్నం: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద విశాఖ నుంచి జయపుర వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురయింది. గురువారం ఉదయం 7.45 గంటలకు ఆంధ్రా-ఒడిశా ఘాట్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో ఐదుగురు ప్రయాణికులున్నారు.
ఇంజిన్‌లో పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు దిగిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సమాచారం అందుకున్న సాలూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకున్నారు. సకాలంలో చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది…ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
- Advertisement -



