- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా వైమానిక దళానికి చెందిన రెండు సీ-130 విమానాలను కూల్చేసినట్లు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఇస్ఫహాన్ ప్రాంతంలో అమెరికాకు చెందిన రెండు సీ-130 విమానాలు, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చేసినట్లు ఇరాన్ సైన్యం వెల్లడించింది. అమెరికాకు చెందిన F-15E ఫైటర్ జెట్ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అమెరికాకు చెందిన ఓ పైలెట్ గల్లంతు కాగా.. ఆ పైలట్ కోసం అమెరికా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం దక్షిణ ఇస్ఫహాన్ ప్రావిన్స్‌లోని ఓ మూతపడిన విమానాశ్రయాన్ని అమెరికా ఉపయోగించుకుందని ఇరాన్ సైన్యం వెల్లడించింది.
- Advertisement -



