Saturday, January 17, 2026
E-PAPER
Homeజాతీయంఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, కోటి రూపాయల రివార్డున్న మోస్ట్ వాంటెడ్ నేత పాపారావు అలియాస్ మోంగు ఉన్నాడు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు వ్యూహకర్తగా పాపారావు వ్యవహరిస్తున్నారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఘటన స్థలంలో రెండు ఏకే రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా పాపారావు భద్రతా దళాల నుంచి తప్పించుకున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -