- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్; మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం నారాయణరావు ఏవోబీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నారు. పీపుల్స్ వార్లో పలు హోదాల్లో పనిచేసిన ఆయన లొంగుబాటును ఏపీ డీజీపీ అధికారికంగా ధృవీకరించనున్నారు. ఈ లొంగుబాటు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
- Advertisement -



