Wednesday, March 25, 2026
E-PAPER
Homeఆటలుటీమిండియాకు మరో షాక్..

టీమిండియాకు మరో షాక్..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌ కు ముందు టీమిండియాకు గాయాల బెడద తప్పడం లేదు. ఇప్పటికే వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ గాయపడగా తాజాగా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా గాయాల జాబితాలో చేరాడు. నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో బౌలింగ్ చేస్తున్నప్పుడు అక్షర్ చేతి వేలికి గాయమైంది. ఈ గాయం తీవ్రమైనది కాదని తెలుస్తున్నా, శుక్రవారం జరగనున్న రెండో టీ20కి అతను దూరమయ్యే అవకాశాలున్నాయి. కాగా తొలి టీ20లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -