Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంట్రంప్‌కు మ‌రో షాక్..హార్వర్డ్ యూనివర్శిటీకీ ఉపశమనం

ట్రంప్‌కు మ‌రో షాక్..హార్వర్డ్ యూనివర్శిటీకీ ఉపశమనం

- Advertisement -

న‌వతెలంగాణ‌-హైద‌రాబాద్: ట్రంప్ ఆంక్షల నుండి హార్వర్డ్ యూనివర్శిటీకీ ఉపశమనం లభించింది. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ జారీ చేసిన ఉత్తర్వులను ఫెడరల్‌ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. హార్వర్డ్‌పై విధించిన ఆంక్షలతో యూనివర్శిటీ ”తక్షణ మరియు కోలుకోలేని గాయాన్ని ” ఎదుర్కొంటుందని జిల్లా జడ్జి అల్లిసన్‌ బరోస్‌ వ్యాఖ్యానించారు. అదనంగా, హార్వర్డ్‌ అంతర్జాతీయ విద్యార్థుల నమోదును రద్దు చేయడానికి ట్రంప్‌ యంత్రాంగం జారీ చేసిన ఉత్తర్వులపై బరోస్‌ తాత్కాలిక సస్పెన్షన్‌ను పొడిగించారు.

ట్రంప్‌ ఆదేశాలను నిలిపివేయాలని కోరుతూ హార్వర్డ్‌ ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించింది. ఈ ఆంక్షలు వైట్‌హౌస్‌ అవసరాలకు వ్యతిరేకమని, హార్వర్డ్‌ వైఖరికి చట్టవిర్ధుమైన ప్రతీకార చర్యగా అభివర్ణించింది. బుధవారం ట్రంప్‌ ప్రకటన .. హార్వర్డ్‌ విద్య మరియు పరిశోధన విజయాలకు గణనీయంగా దోహదపడే 25 శాతం మంది విద్యార్థులను హార్వర్డ్‌ యూనివర్శిటీ నుండి దూరం చేయడానికి ట్రంప్‌ యంత్రాంగం చేసిన మరో ప్రయత్నాన్ని సూచిస్తోందని పలువురు మేధావులు పేర్కొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad