నవతెలంగాణ-హైదరాబాద్: తమిళగ వెట్రి కళగం(TVK) అధినేత విజయ్‌కు మరో షాక్ షాకిచ్చింది భార్య సంగీత. ఇప్పటికే విడాకులు కావాలంటూ తమిళనాడు చెంగల్పట్టులోని జిల్లా కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 20న విచారణ జరగనుంది. ఈక్రమంలోనే తాజాగా కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. విడాకుల కేసు ముగిసేంత వరకు తాను ఇంట్లోనే ఉండేలా అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొంది. అభిప్రాయ భేదాల కారణంగా విజయ్, సంగీత ఐదు సంవత్సరాలుగా విడివిడిగా నివసిస్తున్నట్లు సమాచారం. ప్రేమించి పెండ్లి చేసుకున్న విజయ్-సంగీత్‌లకు 25 ఏళ్ల కుమారుడు, 20 ఏళ్ల కుమార్తె ఉన్నారు. సంగీత్‌ది లండన్‌లోని ప్రముఖ వ్యాపారుస్తుల కుంటుంబం.
TVK అధినేత విజయ్‌కు మరో షాక్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



