Saturday, October 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో మరోసారి కాల్పులు కలకలం..నలుగురు మృతి!

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం..నలుగురు మృతి!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీ సమీపంలో దుండగులు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. శుక్రవారం రాత్రి 8:23 గంటల సమయంలో ఈ కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరి దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.

శుక్రవారం సాయంత్రం వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలో గృహప్రవేశ వేడుకలు జరుగుతున్నాయి. వేలాది మంది అతిథులతో సందడి సందడిగా ఉంది. ఇంతలో దుండగులు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు. ఆ ఘటనలో నలుగురు చనిపోయినట్లుగా సమాచారం. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యూనివర్సిటీ యార్డ్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ సమీపంలోని హోవార్డ్ ప్లేస్‌లోని 600 బ్లాక్‌లో రాత్రి 8:23 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. దుండగులు కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. అనుమానితుల వివరాలను ఇంకా వెల్లడించలేదు. రోడ్లు మూసివేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -