Friday, August 22, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంకోటాకు మరో విద్యార్థిని బలి..

కోటాకు మరో విద్యార్థిని బలి..

- Advertisement -

నవతెలంగాణ – కోటా: పోటీ పరీక్షల శిక్షణకు ప్రసిద్ధి చెందిన రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నీట్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల తెలిపినవివరాల ప్రకారం జమ్మూ కశ్మీర్‌కు చెందిన 18 ఏండ్ల విద్యార్థిని జీషాన్ నెల క్రితం కోటాకు వచ్చి.. ప్రతాప్ చౌరాహా ప్రాంతంలో పేయింగ్ గెస్ట్‌గా ఉంటూ నీట్‌కు సిద్ధమవుతోంది.  ఆదివారం సాయంత్రం ఆమె తన కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడింది. తరవాత వారు తిరిగి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినప్పటికీ స్పందించకపోవడంతో విద్యార్థి స్నేహితురాలికి కాల్‌ చేశారు. ఆమె గది వద్దకు వెళ్లగా లోపలి నుంచి గడియ వేసి ఉండడంతో.. ఇతరుల సాయంతో తలుపులు పగలగొట్టారు. అక్కడ సదరు విద్యార్థిని ఉరి వేసుకొని ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె అప్పటికే  మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad