Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంరష్యాలో మరో రైలు ప్రమాదం..

రష్యాలో మరో రైలు ప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రష్యాలో రైల్వే వంతెనలు కూలుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రియాన్స్క్ ప్రాంతంలో ఒక వంతెన కూలి ఏడుగురు మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే.. కుర్స్క్ ప్రాంతంలో మరో రైల్వే వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో గూడ్స్ రైలు పట్టాలు తప్పి కింద పడిపోయింది.

స్థానిక కాలమానం ప్రకారం కుర్స్క్ ప్రాంతంలో ఈ తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. జెలెజ్నోగోర్స్క్ జిల్లాలోని ట్రోస్నా-కలినోవ్కా హైవేపై 48వ కిలోమీటరు వద్ద ఉన్న రైల్వే వంతెన మీదుగా ఒక గూడ్స్ లోకోమోటివ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని ప్రాంతీయ గవర్నర్ అలెగ్జాండర్ ఖిన్‌ష్టీన్ టెలిగ్రామ్ ద్వారా వెల్లడించారు. “జెలెజ్నోగోర్స్క్ జిల్లాలో ఒక గూడ్స్ లోకోమోటివ్ వెళుతున్నప్పుడు వంతెన కూలిపోయింది.

రైలులోని కొంత భాగం వంతెన కింద ఉన్న రహదారిపై పడిపోయింది” అని ఆయన తెలిపారు. వంతెన కూలడంతో గూడ్స్ రైలు ఇంజన్ కింద ఉన్న రహదారిపై పడిపోయింది. పట్టాలు తప్పిన వెంటనే లోకోమోటివ్‌లో మంటలు చెలరేగాయని, అయితే రష్యన్ అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో లోకోమోటివ్ డ్రైవర్లలో ఒకరి కాళ్లకు గాయాలైనట్లు ప్రాథమిక సమాచారం. రైలు సిబ్బంది అందరినీ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సేవల బృందాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయని ఖిన్‌ష్టీన్ వివరించారు. రైలు కిందపడిన రహదారిని మూసివేసి, ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad