- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కాశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్ డ్రోన్ దాడులకు పాల్పడగా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవటం మాత్రమే కాకుండా.. పూర్తి స్వదేశీ ఆయుధాలతో పాకిస్థాన్‌లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశామని భారత్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పలు వీడియోలను కూడా భారత సైన్యం ఇప్పటికే సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తాజాగా మరో కీలక వీడియోను పంచుకుంది.
- Advertisement -