- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సీఆర్డీఏ పరిధిలో అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు చేసే ఛాన్స్ ఉంది. రూ. 904 కోట్లతో రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతులు కల్పనకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం. అలాగే, జిల్లాల పునర్విభజన, పలు జిల్లాల పేర్లు మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి మంత్రి వర్గంలో చర్చించే అవకాశం ఉంది.
- Advertisement -