Saturday, July 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకానిస్టిట్యూషన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా ట్రెజరర్‌గా ఏపీ జితెందర్‌ రెడ్డి ఏకగ్రీవం

కానిస్టిట్యూషన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా ట్రెజరర్‌గా ఏపీ జితెందర్‌ రెడ్డి ఏకగ్రీవం

- Advertisement -

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా ట్రెజరర్‌గా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ ఏ.పీ జితేందర్‌ రెడ్డి ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో జితేందర్‌ రెడ్డిని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ట్రెజరర్‌ పదవిలో జితేందర్‌ రెడ్డి ఐదేండ్ల పాటు కొనసాగనున్నారు. ఈ సందర్భంగా జితేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ట్రెజరర్‌గా బాధ్యతలను సమర్థంగా నిర్వహించి, క్లబ్‌ గౌరవాన్ని పెంపొందించేందుకు కషి చేస్తానని తెలిపారు. కాగా మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా ఆయన సేవలందించారు. ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -