Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలురేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వానికి క్ష‌మాప‌ణ‌లు: జూ.ఎన్టీఆర్

రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వానికి క్ష‌మాప‌ణ‌లు: జూ.ఎన్టీఆర్

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: ”వేదికపై ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పడం మర్చిపోయినందుకు క్షమించాలి ” అని సినీనటుడు జూనియర్‌.ఎన్‌టిఆర్‌ అన్నారు. ఎన్‌టిఆర్‌, హృతిక్‌ ప్రధానపాత్రల్లో నటించిన ‘వార్‌ 2’ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. అభిమానుల సందడి మధ్య ఆ వేడుక విజయవంతమైంది.

అయితే తెలంగాణ ప్రభుత్వ సహకారం వల్లే ఈవెంట్‌ ప్రశాంతంగా జరిగిందని ఎన్టీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని వేదికపై చెప్పడం మర్చిపోయినందుకు క్షమాపణ తెలిపారు. ” వేదికపై ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పడం మర్చిపోయినందుకు క్షమించాలి. నా 25 సంవత్సరాల సినీ కెరీర్‌ను అభిమానులతో పంచుకునే ఆనందంలో ఈ తప్పు జరిగింది. ఈ ఈవెంట్‌కు సహకారం అందించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అలాగే హైదరాబాద్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వారందరికీ నా కఅతజ్ఞతలు. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. మీరు చాలా సహకారం అందించారు. అభిమానులను ఎంతో బాధ్యతగా చూసుకున్నారు. వారి ఆనందానికి మీరు కూడా కారణమయ్యారు ” అంటూ ఎన్టీఆర్‌ ధన్యవాదాలు చెప్పారు.

అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో ‘వార్‌ 2’ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. కియారా అడ్వాణీ కథానాయిక. ఎన్టీఆర్‌ ఈ సినిమాతో బాలీవుడ్‌ను పలకరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలు సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనూ ఎన్టీఆర్‌ ఈ సినిమా కచ్చితంగా హిట్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అభిమానులను ఉద్దేశించి ఎమోషనల్‌ స్పీచ్‌ ఇచ్చారు. ”ఎవరెన్ని కామెంట్స్‌ చేసినా ‘వార్‌2’ బొమ్మ అదిరిపోతుంది. సినిమాలో ట్విస్ట్‌లు ఉన్నాయి. దయచేసి బయట పెట్టకండి. ఇది హిందీ మూవీనే కాదు.. తెలుగు సినిమా కూడా” అంటూ తనపై ప్రేమాభిమానాలు చూపుతోన్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img