Tuesday, December 16, 2025
E-PAPER
Homeజాతీయంఢిల్లీ వాసుల‌కు క్ష‌మాప‌ణ‌లు: బీజేపీ

ఢిల్లీ వాసుల‌కు క్ష‌మాప‌ణ‌లు: బీజేపీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప‌లు రోజుల నుంచి ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న విష‌యం తెలిసిందే. గాలి కాలుష్యంతో పాటు ద‌ట్ట‌మైన పొగ‌మంచు ఢిల్లీ వాసుల‌కు ఊపిరి ఆడ‌కుండా చేస్తోంది. దీంతో శ్వాస తీసుకోవ‌డానికి స్థానికులు అనేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. రోజురోజుకు గాలిలో నాణ్య‌త ప‌డిపోవ‌డంతో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న నెల‌కొంది. ఢిల్లీ వాతావ‌ర‌ణ కాలుష్యంపై రేఖాగుప్తా ప్ర‌భుత్వంపై జ‌నాలు ఆగ్ర‌హాంతో ఉన్నారు. అధికారం చేప‌ట్టి రోజులు గ‌డుస్తున్న గాలి నాణ్య‌త‌లో ప‌రిస్థితి మెరుగుద‌ల క‌న్పించ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌లు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈక్ర‌మంలో బీజేపీ మంత్రి వాయు కాలుష్యంపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వాయు కాలుష్య నివార‌ణ‌కు, ప్ర‌జ‌ల‌కు స్వ‌చ్ఛ‌మైన గాలిని అందించేందుకు త‌మ ప్ర‌భుత్వం అని విధాలుగా ప్ర‌య‌త్నాలు చేసిందని, కానీ ప‌రిస్థితిలో పురోగ‌తి లేద‌ని, ఢిల్లీ వాసులు త‌మ‌ను, బీజేపీ ప్ర‌భుత్వాన్ని క్షమించాల‌ని ఆ రాష్ట్ర ప‌ర్యావ‌ర‌ణ మంత్రి మంజీంద‌ర్ సింగ్ కోరారు.

అయితే ప్రస్తుతం ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. సెంట్రల్ పొల్యూషన్ బోర్డు డేటా ప్రకారం కొన్ని ప్రాంతాలలో వాతావరణ కాలుష్యం 400 పాయింట్ల కంటే అధిక స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బొగ్గు,కట్టెలతో తందూరి వంటకాలను తయారు చేసే రెస్టారెంట్లు, హోటళ్లపై బ్యాన్‌ విధించింది. ఇది వరకే కాలుష్య కారకాలకు సంబంధించిన పలు కారకాలపై నిషేధాజ్ఞలు విధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -