నవతెలంగాణ-హైదరాబాద్: సీతాఫలమండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్.G.బంగ్లా భారతి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ సీతాఫలమండి లో ఉన్న ఈ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్(1) సబ్జెక్టు సంబంధించి ఒక పొస్టు ఖాళీ ఉందని పేర్కొన్నారు. గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 8వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు గడువు విధించారు. పీజీలో 55 శాతం మార్కులతో పాటు PH.D, నెట్, సెట్, స్లెట్ ఉన్న వారికి ప్రథమ ప్రాధాన్యతనిస్తారు. సెప్టెంబర్ 9న విద్యానగర్ లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో డెమో, ఒరిజినల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు.అభ్యర్థులు నేరుగా కాలేజ్‌కు వచ్చి దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES