నవతెలంగాణ-నెల్లికుదురు
మండలంలోని మునిగల వీడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు బోధించేందుకు ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి ఏ రాందాస్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించనున్నది ఈ నేపథ్యంలో నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతిలను ప్రారంభించడానికి అనుమతి లభించింది. ప్రీ ప్రైమరీ బోధించేందుకు రెండు పోస్టులు మంజూరైనట్లు తెలిపారు. పూర్వ ప్రాథమిక బోధకులు (ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ )పోస్టుకు ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి. ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. బాలవిద్య లేదా ప్రాథమిక బోధనలో అర్హత ఉన్న అభ్యర్థులకు, వితంతులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది .ఎంపిక ప్రక్రియలో స్థానిక మండల వాసి, స్థానిక గ్రామపంచాయతీ , స్థానిక ప్రాంతంలో నివాసి అయి ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ , బీసీ, ఈ డబ్ల్యూ ఎస్, వారికి ఐదు సంవత్సరాలు మాజీ సైనికులకు మూడు సంవత్సరాలు వికలాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. ఇట్టి పోస్టు తాత్కాలిక ప్రాతిపదికన తీసుకోవడం జరుగుతుంది. ఫ్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్కు నెలకు రూ. 8000 గౌరవ వేతనం ఆయాకు నెలకు రూ.6000 గౌరవ వేతనం చెల్లించబడుతుంది. విద్యా సంవత్సరంలో 10 నెలలు మాత్రమే వీరికి గౌరవ వేతనం చెల్లించబడుతుంది .అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల ఏడవ తారీఖు లోపు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించగలరు. దరఖాస్తు ఫారం తో పాటు వయస్సు విద్యాహర్వత స్థానిక నివాస ధ్రువీకరణ పత్రాలను జతపర్చాలి. దరఖాస్తు పారంలు అన్ని జిరాక్స్ సెంటర్లలో అందుబాటులో ఉంటాయి అని ఎంఈఓ రామదాసు తెలిపారు.
ప్రీ ప్రైమరీ ఆయా పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


