- Advertisement -
నవతెలంగాణ – గంభీరావుపేట: గంభీరావుపేట మండల పరిధిలోని రైతులు రైతు భీమా దరఖాస్తు చేసుకోడానికి 2024 జూలై నుండి ఇప్పటివరకు పట్ట పాస్ బుక్ పొందినవారు అర్హులని గంభీరావుపేట మండల వ్యవసాయాధికారి మహమ్మద్ సలావుద్దీన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా వ్యవసాయాధికారి సలావుద్దీన్ మాట్లాడుతూ రైతులు దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు ఫారం, రైతు పొలం పట్టా పాసుబుక్ జిరాక్స్, పట్టాదారు ఆధార్ కార్డు జిరాక్స్, నామిని ఆధార్ కార్డు జిరాక్స్, రైతులు స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకోవాలని చివరి తేదీ జులై 31 వరకు సమర్పించాలని సూచించారు. గతంలో చేసుకొని వారు మరియు కొత్తగా పాస్ బుక్ పొందిన వారు చేసుకోగలరు.
- Advertisement -