Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తుల  ఆహ్వానం 

సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తుల  ఆహ్వానం 

- Advertisement -

– జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మాచర్ల వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-భూపాలపల్లి
: సీఎం ఓవర్సిస్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకోవాలనీజిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మాచర్ల వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అల్ప సంఖ్యాక వర్గాల(మైనార్టీలు) (ముస్లింలు, క్రీస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు) వారికి సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టరల్ స్టడీస్ (అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, న్యూజిల్యాండ్, సౌత్ కొరియా, సింగపూర్ )దేశాలలో చదువుటకు అర్హతగల అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతున్నామని తెలిపారు.

ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నుండి 30 జూన్ వరకు అడ్మిషన్ తీసుకున్న జిల్లాకు సంబందించిన అర్హత గల అభ్యర్థులుwww.telanganaepass.cgg.gov.inవెబ్ సైట్ ద్వారా తేది: 01.06.2025 నుండి తేది: 30.06.2025 సాయంత్రం 5.00 గంటల లోపు దరఖాస్తు చేసుకొవలన్నారు.

ఈ పథకం కింద ఎంపికయిన విద్యార్థికి స్కాలర్షిప్ 20 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తు పత్రాలు వచ్చేనెల 31లోపు నాంపల్లిలోని హాజ్ హౌస్ లో ఆరవ అంతస్తుల జిల్లా మైనార్టీస్ సంక్షేమాధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు. ఒక వేల తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించినచో సంబంధితులపై చట్ట పరమైన చర్య తీసుకుంటామనీ తెలిపారు. ఇతర వివరాల కోసం ఫోన్ నంబర్ 040-23240134కు సంప్రదించాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img