Saturday, March 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇన్ సర్వీస్ అభ్యర్థులకు ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇన్ సర్వీస్ అభ్యర్థులకు ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం 
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ప్రభుత్వ ఐటీఐలో 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల కోసం ఇన్ సర్వీస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డి. చంద్ర మోహన్ ఒక ప్రకటన లో తెలిపారు.

ప్రవేశాల కోసం ఇన్ సర్వీస్ అభ్యర్థులు తమ దరఖాస్తులను ప్రభుత్వ ఐటీఐ, కాటారం కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు సంబంధిత పత్రాలతో పాటు తమ ఉద్యోగ వివరాలు, ఈఎస్ఐ (ESI), పీఎఫ్ (PF) సంబంధిత వివరాలను కూడా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

దరఖాస్తుల సమర్పణకు చివరి తేది మార్చి 15, 2026గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తులు సమర్పించేటప్పుడు సంబంధిత రిజిస్టర్, డిపార్ట్‌మెంట్ హెడ్ సర్టిఫికేట్, సర్వీస్ రికార్డ్ వంటి పత్రాలను తప్పనిసరిగా జత చేయాలని సూచించారు. ఇన్ సర్వీస్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని ప్రిన్సిపాల్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -