నవతెలంగాణ – డిండి : జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి డిండి తహసీల్దార్ హన్మంతు శ్రీనివాస్ గౌడ్ గురువారం ఒక ప్రకటన లో తెలిపారు. 18 నుండి 59 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న కుటుంబ పెద్ద మరణిస్తే ఇంట్లోని కుటుంబ సభ్యులు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కొరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 1 ఎప్రిల్ 2017 తరువాత చనిపోయిన వారి వారసులు ఈ పథకానికి అర్హులన్నారు. తేదీ ఈ నెల 30 శనివారం దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజని ఆయన తెలిపారు. సంబంధిత గ్రామ పంచాయతీలో గాని, తహశీల్దార్ కార్యాలయం గుండ్లపల్లి లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ధరఖాస్తు వెంట మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం, ఆదాయ ధ్రువీకరణ పత్రం జతపరచాలని ఆయన అన్నారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: తహసీల్దార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES