నవతెలంగాణ – జుక్కల్ : లంబాడా హక్కుల పోరాట సమితి (LHPS) కమిటీ జిల్లా అధ్యక్షులు జాదవ్ గణేష్ నాయక్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ , జిల్లా అధ్యక్షులు గణేష్ నాయక్ , రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ నాయక్ గారి ఆధ్వర్యంలో జుక్కల్ మండల అధ్యక్షులు రాథోడ్ అనిల్ నాయక్ గుల్ల తండా మరియు ప్రధాన కార్యదర్శి సంజీవ్ జాదవ్ సవర్గావ్ తాండా గారికి నియామక పత్రం రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్ ఇవ్వడం జరిగింది. సోమవారం నాడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు, ట్రై కార్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ ఆదేశాల మేరకు….. రాష్ట్ర అధ్యక్షులు రాంబాల్ నాయక్ తమకు నియామక పత్రం అందజేశారు. తమ పై విశ్వాసం ఉంచి విలువైన పదవి పెట్టినందుకు లంబాడా హక్కుల సాధన కోసం, వారి ఆర్థిక అభివృద్ధి కోసం, వారి సమస్యల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చెయ్యడం జరుగుతుందని రాథోడ్ అనిల్ నాయక్, ప్రధాన కార్యదర్శి సంజీవ్ జాదవ్ అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర
వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్ , రాష్ట్ర ఉపాధ్యక్షులు జాదవ్ శ్రావణ్ , రాష్ట్ర కార్యదర్శి జాదవ్ లక్ష్మణ్ , కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గణేష్ నాయక్ , జిల్లా ప్రధాన కార్యదర్శి భద్రి నాయక్, జిల్లా గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ గణపతి తదితరు పాల్గొన్నారు.