Wednesday, December 17, 2025
E-PAPER
Homeకరీంనగర్తొలిసారి ఓటు వేసిన విలువిద్య క్రీడాకారిణి చికిత

తొలిసారి ఓటు వేసిన విలువిద్య క్రీడాకారిణి చికిత

- Advertisement -

– సుల్తాన్ పూర్ లో తల్లిదండ్రులతో కలిసి ఓటు వేసిన ప్రపంచ క్రీడాకారిణి చికిత
నవతెలంగాణ- ఎలిగేడు : పెద్దపల్లి జిల్లాఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బుధవారం అంతర్జాతీయ విలువిద్య క్రీడాకారిణి, బంగారు పతకం విజేత తానిపర్తి చికిత తొలిసారిగా తల్లిదండ్రులు శ్రీనివాస్ రావు- శ్రీలతలతో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా చికిత మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది ఆయుధంలాంటిదని తెలిపారు. ప్రతి ఒక్కరు ఎన్నికల్లో ఓటు వేసి ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి తోడ్పడే సమర్థవంతమైన నాయకులను ఎన్నుకొనే అవకాశం ఉందన్నారు. క్రీడల్లో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ చాలా దూరం నుండి ఓటు వేసేందుకు వచ్చాననీ, తొలిసారిగా ఈ ఎన్నికల్లో ఓటు వేయడం ఆనందంగా ఉందని పేర్కొంది. యువతతో పాటు ప్రతి ఒక్కరు ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -