టీడబ్ల్యూజేఎఫ్ ఖండన
నవతెలంగాణ-హైదరాబాద్
ఎన్టీవీకి చెందిన ముగ్గురు జర్నలిస్టులను ఎలాంటి నోటీసు, సెర్చ్ వారంట్, విచారణ గానీ లేకుండానే ఇండ్లల్లోకి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అడ్‌హక్ కమిటీ కన్వీనర్ పి.రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య ఖండించారు. కుటుంబంతో కలిసి టూర్ వెళుతున్న దొంతు రమేష్‌ను ఎయిర్‌పోర్టులో, పరిపూర్ణాచారి, సుధీర్‌బాబును కుటుంబ సభ్యులు భయాందోళనకు గురిచేస్తూ అర్ధరాత్రి ఇండ్లల్లోకి వెళ్లి అరెస్ట్ చేయడంలో వ్యవహరించిన తీరు సరికాదని అభిప్రాయపడ్డారు. ముగ్గురు వర్కింగ్ జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపేలా ప్రభుత్వం పోలీసులను ఆదేశించాలని కోరారు. వార్తల ప్రసారంలో అభ్యంతరం ఉంటే ప్రెస్‌కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని గుర్తుచేశారు. వార్తల ప్రచురణ, ప్రసారాలకు మీడియా యాజమాన్యాలే బాధ్యత వహించాలని అభిప్రాయడ్డారు. ఈ మేరకు వారు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
నోటీసులు లేకుండానే జర్నలిస్టుల అరెస్టులా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



