Thursday, May 15, 2025
Homeజాతీయంజమ్మూలో ఆర్మీ బ‌ల‌గాల డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్

జమ్మూలో ఆర్మీ బ‌ల‌గాల డోర్‌ టు డోర్‌ క్యాంపెయిన్

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడితో ఆగ్ర‌హించిన భార‌త్..పాక్ పై ఆప‌రేష‌న్ సిందూర్ పేరుతో క‌దంతొక్కిన విష‌యం తెలిసిందే. పాకిస్థాన్‌లోని ఉగ్ర‌వాద శిబిరాలే ల‌క్ష్యంగా భార‌త్ బ‌ల‌గాలు దాడి చేయ‌గా.. సాధార‌ణ పౌరుల నివాసాలే ల‌క్ష్యంగా పాక్ ఆర్మీ దాడుల‌కు తెగ‌బ‌డింది. ఈ దాడుల్లో జమ్మూలోని నియంత్ర‌ణ‌కు అతీ స‌మీపంలో ఉన్న పూంచ్ ప‌రిస‌ర ప్రాంతాల్లోని ప‌లు గ్రామాస్తుల ఇండ్లు ధ్వంస‌మైయ్యాయి. గురువారం ఆర్మీ బ‌ల‌గాలు ఆయా గ్రామాల్లో ఇంటింటి వెళ్లి బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించారు. దాడుల్లో గాయ‌ప‌డిన వారికి మెడిక‌ల్ కిట్లు, నిత్యావ‌స‌ర స‌రుకులు అంద‌జేశారు. బాధితుల‌ను స్వ‌యంగా క‌లిసి అవ‌స‌ర‌మైన మౌలిక స‌దుపాయ‌లు క‌ల్పిస్తున్నారు. నిన్న సీఎం ఓమ‌ర్ అబ్దుల్లా కూడా స‌రిహ‌ద్దు గ్రామాల్లో ప‌ర్య‌టించారు. పాక్ కాల్పుల్లో మ‌ర‌ణించిన కుటుంబాల‌కు న‌ష్ట‌ప‌రిహారంతో పాటు ధ్వంస‌మైన ఇండ్ల‌ను పున‌ర్ నిర్మిస్తామ‌ని సీఎం ఓమ‌ర్ అబ్దుల్లా హామీ ఇచ్చారు. బాధితుల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని, ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని సీఎం భ‌రోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -