నవతెలంగాణ – కొలంబొ : శ్రీలంకలో శుక్రవారం ఒక సైనిక హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు సైనికులు మరణించినట్లు అధికారులు ఒక ప్ర కటనలో తెలిపారు. సైన్యం, వైమానిక దళానికి చెందిన 12 మందిని మిలటరీ పెరేడ్ కోసం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వైమానిక ప్రతినిధి ఎరాండా గీగనాగే తెలిపారు. కొలంబోకు ఈశాన్యంగా 280 కిలోమీటర్లు దూరంలో ఉన్న మదురు ఓయాలోని రిజర్వాయర్‌లో కూలిపోయిందని అన్నారు. సైన్యాన్ని బయటకు తీసి, ఆస్పత్రికి తరలించామని అన్నారు. మృతిచెందిన వారిలో ఇద్దరు ఎయిర్ ఫోర్స్, నలుగురు ప్రత్యేక దళ సైనికాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై విచారణ చేపట్టేందుకు 9 మంది సభ్యులతో శ్రీలంక వైమానిక దళం ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
శ్రీలంకలో కూలిన ఆర్మీ హెలికాప్టర్ .. ఆరుగురు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES