- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ నెల 10 నుంచి 22 వరకు హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఇందులో ఎన్‌రోల్ చేసుకోవచ్చు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్, ట్రేడ్స్‌మన్ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 12న అడ్మిట్ కార్డులు పొందిన వారికే ఈ అవకాశం అని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు 040-27740059కు కాల్ చేయాలని సూచించారు.
- Advertisement -



