Thursday, May 8, 2025
Homeరాష్ట్రీయంకాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు ఏర్పాట్లు

కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు ఏర్పాట్లు

- Advertisement -

– అధికారులకు మంత్రుల దిశానిర్దేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ పుష్కరాలను పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నదనీ, రవాణా, పారిశుద్ధ్యం, భద్రతా, వైద్యం, ప్రచార ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాలని చెప్పారు. గతంలో సమ్మక్క – సారక్క ఇతర దైవ కార్యాల అనుభవాలతో ఏర్పాట్లు చేయాలనీ, చిన్న పిల్లలు, గర్భిణీలు, వృద్ధులకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పెండింగ్‌ ఇంజినీరింగ్‌ పనుల్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంగళవారంనాడిక్కడి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలపై మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, డీజీపీ జితేందర్‌, దేవాదాయ శాఖ ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌, సెర్ప్‌ సీఈఓ దివ్యా దేవరాజన్‌, ఎండోమెంట్‌ కమిషనర్‌ వెంకటరావు, అడిషనల్‌ కమిషనర్‌ కృష్ణవేణి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు. 12 రోజులు జరిగే పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని చెప్పారు. కాళేశ్వరంకు సంబంధించిన వివరాలన్నీ వెబ్‌సైట్‌, యాప్‌ ద్వారా తెలియజేయాలన్నారు. ఆర్టీసీ బస్సులను అవసరానికి అనుగుణంగా నడపాలనీ, భక్తుల సౌకర్యార్థం టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు ఒక పీఠాధిపతి పుష్కర స్నానం చేస్తారని తెలిపారు. పుష్కరాలు ప్రారంభమయ్యే 15, 16 తేదీల్లో మెదక్‌ జిల్లా రంగపేటలోని శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠం పీఠాధిపతులు మాధవానంద సరస్వతి ఈ పుష్కరాలను ప్రారంభిస్తారన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -