నవతెలంగాణ-హైదరాబాద్: బలవంతంగా మత మార్పిడులకు పాల్పడుతున్నారని కేరళకు చెందిన ఇద్దరు నన్స్‌ను ఛత్తీస్‌గడ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారి నిర్భందం చట్టవ్యతిరేకమని, వెంటనే వారిని విడుదల చేయాలని సీపీఐ(ఎం) మాజీ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ డిమాండ్ చేశారు. బుధవారం ఛత్తీస్‌గడ్‌లోని దుర్గా సెంట్రల్ జైలులో వారిని కలిసి పరామర్శించారు. అవాస్తవాలతో కేరళకు చెందిన ఇద్దరిని నన్స్‌ను అరెస్ట్ చేసి జైలులో వేశారని, ఇది అన్యాయమని మండిపడ్డారు.
గిరిజన బాలుడు ఏ తప్పు చేయకున్నా జైలులో శిక్ష అనుభవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బజరంగ్ దళ్, RSS ప్రోదల్బంతో ఈ తరహా అరెస్టులు కొనసాగుతున్నాయని ఆరోపించారు.పీఎం మోడీ విదేశాలకు వెళ్లి సబ్‌కాసాత్ వికాస్ అని నినదిస్తారు, కానీ స్వదేశంలో మాత్రం సొంత ప్రజలకు అన్యాయం జరుగుతున్నా, అమాయకులపై దాడులు జరుగుతున్న పట్టించుకోట్లేదని విమర్శించారు. ఎందుకంటే వారు తమ ఇష్టానుసారం క్రైస్తవ మతాన్ని స్వీకరించడమేనని , అందుకే క్రైస్తవ కమ్యూనిటి లక్ష్యంగా అరెస్టులు చేస్తున్నారని బృందకారత్ ఆరోపించారు.