– టిడబ్లుజేఎఫ్ హన్మకొండ జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ వలి
నవతెలంగాణ – ఆత్మకూరు : ఎన్‌టివి ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్‌లను వెంటనే విడుదల చేయాలని టిడబ్లుజేఎఫ్ హన్మకొండ జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ వలి డిమాండ్ చేశారు.బుధవారం సయ్యద్ వలి ఆత్మకూరు మండలంలో మాట్లాడుతూ…. ఐదురోజుల క్రితం ప్రసారమైన వార్త పై సీపీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు పూర్తి కాగానే జర్నలిస్టులను అరెస్టు చేయడం సరైనది కాదని తీవ్రంగా ఖండించారు. సిట్ విచారణ పూర్తి చేయకుండా, నిజాలు తేల్కకుండా ఈ చర్య రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చ గుర్తుగా మారుతోందని అన్నారు. మంగళవారం సాయంత్రం ఎన్‌టివి యాజమాన్యం క్షమాపణ కోరినా, పోలీసులు జర్నలిస్టులను అరెస్టు చేసి అరెస్టు చూపకుండా, వారిని ఎక్కడ ఉంచారో చెప్పకుండా దాచిపెట్టడం దారుణమని సయ్యద్ వలి ఆక్షేపించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



