Monday, March 23, 2026
E-PAPER
Homeఖమ్మంపరిశ్రమల్లోనూ “ఎర్రైవ్ ఎలైవ్”

పరిశ్రమల్లోనూ “ఎర్రైవ్ ఎలైవ్”

- Advertisement -

– భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టం చేసిన ఆయిల్ ఫెడ్
– హెల్మెట్ లేకుంటే వాహనాలకు పరిశ్రమ లోకి నిరాకరణ
నవతెలంగాణ – అశ్వారావుపేట

“ఎర్రైవ్ ఎలైవ్” (సజీవంగా ఇంటికి చేరుదాం) అనే నినాదంతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్న పోలీస్ శాఖ చర్యలను ఆదర్శంగా తీసుకుని అశ్వారావుపేటలోని ఆయిల్ ఫెడ్ పరిశ్రమ భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తోంది.

పరిశ్రమలోకి ప్రవేశించే సిబ్బంది, సందర్శకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని స్పష్టమైన నిబంధన అమలు చేస్తున్నారు. హెల్మెట్ లేకుండా వచ్చిన వాహనాలను గేటు బయటే నిలిపివేస్తున్నారు. భద్రతా పరంగా తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని స్థానికులు పేర్కొంటున్నారు.

ఇతర పరిశ్రమలు కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తే హెల్మెట్ వినియోగం మరింత పెరిగి,రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం తగ్గే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సందర్భంగా ఆయిల్ ఫెడ్ అశ్వారావుపేట పరిశ్రమ మేనేజర్ ఎం.ఎన్. కార్తీక్ మాట్లాడుతూ.. “భద్రతే మా ప్రథమ లక్ష్యం. హెల్మెట్ వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ నిబంధన ఉద్దేశ్యం.పరిశ్రమలో పనిచేసే వారు ఎక్కువగా అల్ప వేతనాలతో జీవనం సాగించే వారు. ప్రమాదం సంభవిస్తే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. హెల్మెట్ వినియోగంతో ప్రాణాపాయం నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుంది” అని తెలిపారు.

భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ “ఎర్రైవ్ ఎలైవ్” నినాదాన్ని ఆచరణలో పెట్టిన ఆయిల్ ఫెడ్ చర్యలు ఇతర పరిశ్రమలకు ఆదర్శంగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -