Tuesday, March 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపరిశ్రమల్లోనూ 'ఎర్రైవ్‌ ఎలైవ్‌'

పరిశ్రమల్లోనూ ‘ఎర్రైవ్‌ ఎలైవ్‌’

- Advertisement -

– భద్రతా ప్రమాణాలు కట్టుదిట్టం చేసిన ఆయిల్‌ ఫెడ్‌
– హెల్మెట్‌ లేని వాహనాలు పరిశ్రమలోకి నిరాకరణ
నవతెలంగాణ-అశ్వారావుపేట

”ఎర్రైవ్‌ ఎలైవ్‌” (సజీవంగా ఇంటికి చేరుదాం) అనే నినాదంతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్న పోలీస్‌ శాఖ చర్యలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఆయిల్‌ ఫెడ్‌ పరిశ్రమ ఆదర్శంగా తీసుకుంది. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. పరిశ్రమలోకి ప్రవేశించే సిబ్బంది, సందర్శకులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని స్పష్టమైన నిబంధన అమలు చేస్తోంది. హెల్మెట్‌ లేకుండా వచ్చిన వాహనా లను గేటు బయటే నిలిపివేస్తున్నారు. భద్రతాపరంగా తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని స్థానికులు పేర్కొంటున్నారు. ఇతర పరి శ్రమలు కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తే హెల్మెట్‌ వినియోగం మరింత పెరిగి, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టం తగ్గే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఆయిల్‌ ఫెడ్‌ అశ్వారావుపేట పరిశ్రమ మేనేజర్‌ ఎంఎన్‌ కార్తీక్‌ మాట్లాడుతూ.. ”భద్రతే మా ప్రథమ లక్ష్యం. హెల్మెట్‌ వినియోగాన్ని ప్రోత్సహించడమే ఈ నిబంధన ఉద్దేశం. పరిశ్రమలో పనిచేసే వారు ఎక్కువగా తక్కువ వేతనాలతో జీవనం సాగించే వారు. ప్రమాదం సంభవిస్తే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టాయి. హెల్మెట్‌ వినియోగంతో ప్రాణాపాయం నుంచి రక్షణ పొందే అవకాశం ఉంటుంది” అని తెలిపారు. భద్రతా నిబంధనలను కచ్చి తంగా అమలు చేస్తూ ”ఎర్రైవ్‌ ఎలైవ్‌” నినాదాన్ని ఆచరణలో పెట్టిన ఆయిల్‌ ఫెడ్‌ చర్యలు ఇతర పరిశ్రమలకు ఆదర్శంగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -