Tuesday, September 16, 2025
E-PAPER
HomeజాతీయంArunachal Pradesh:విరిగిపడిన కొండచరియలు

Arunachal Pradesh:విరిగిపడిన కొండచరియలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అరుణాచల్ ప్రదేశ్ లో కొండచరియలు విరిగిపడి రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. బండరాయి ఒకటి కొండ పైనుంచి దొర్లుకుంటూ రావడం గమనించిన వాహనదారులు అప్రమత్తం కావడంతో ప్రాణనష్టం తప్పింది. పశ్చిమ కామెంగ్ జిల్లా సప్పర్ క్యాంప్ ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడడంతో దిరాంగ్, తవాంగ్ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వెంటనే స్పందించిన అధికారులు రోడ్డుపై నిలిచిన రాళ్లను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. కాగా, కొండ పైనుంచి రాళ్లు పడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -