Wednesday, January 7, 2026
E-PAPER
Homeహైదరాబాద్అరుంధతి సేవక్ మండలి సర్వసభ్య సమావేశం…

అరుంధతి సేవక్ మండలి సర్వసభ్య సమావేశం…

- Advertisement -

నవతెలంగాణ-సుల్తాన్ బజార్:
అరుంధతి సేవక్ మండలి సర్వసభ్య సమావేశాన్ని మండలి ప్రధాన కార్యదర్శి ఎం ధర్మేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో హాజరైన 80 మంది సభ్యుల కోరిక మేరకు ప్రస్తుత కమిటీ కాల పరిమితి గత యేడాది డిసెంబర్ 26 నాటికి 3 సంవత్సరాలు పూర్తైన సంధర్భంగా.. ప్రస్తుత కమిటీని రద్దు చేయాలని సభ్యులందరు తీర్మానం చేయడంతో పాటు అడహక్ కమిటీని వేయాలని తీర్మానించారు. దీంతో సభ్యుల కోరిక మేరకు నూతన అడహక్ కమిటీని ఎన్నుకున్నామ‌న్నారు. ఈ అడహక్ కమిటీలో కేఆర్ శ్రీనివాస్,డి జనార్ధన్, ఎం మేఘరాజ్, సురేందర్, జి యాదగిరి, బి సురేష్ కుమార్, బసంత్ లాల్, బాబురావు, ఎం మహేశ్వర్, ఎం వేణు కుమార్,బాలసాయిలు తదితరులను ఎన్నుకోవడం జరిగిందని సేవా మండలి ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర వివరించారు . నూతనంగా ఎన్నికైన అడహక్ కమిటి సభ్యులు అందరితో సంప్రదింపులు జరిపి ఎలక్షన్ కమిటీ ఏర్పాటుకు, నూతన క కమిటీ ఎన్నుకోవడానికి కృషి చేయాలని సర్వ సభ్యులు నిర్ణయించారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -