- Advertisement -
నవతెలంగాణ-వెల్దండ: వెల్దండ మండల కేంద్రం పరిధిలోని చొక్కనపల్లి గ్రామానికి చెందిన ఈదులపల్లి శ్రీను ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆదివారం వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు బచ్చు రామకృష్ణలు చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పరామర్శించారు. అనంతరం రూ.5వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బాబా, మల్లేష్ తోపాటు తదితరులున్నారు.
- Advertisement -



