Monday, November 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆర్యవైశ్యులకు భక్తితోపాటు సేవాగుణం ఉండాలి 

ఆర్యవైశ్యులకు భక్తితోపాటు సేవాగుణం ఉండాలి 

- Advertisement -

ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు 
నవతెలంగాణ – మిడ్జిల్ 

ఆర్యవైశ్యులకు భక్తితో పాటు ఆపదలో ఉన్న వారికి అండగా ఉండడానికి సేవా గుణాలు ఉన్నాయని మిడ్జిల్ ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు, ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రామకృష్ణ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కార్తీకమాసాన్ని పురస్కరించుకొని ఆర్య సంఘం మండల అధ్యక్షులు ఎన్నో సత్యగుప్త ఆధ్వర్యంలో కార్తిక వనభోజనం  నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రకృతి సోయగాల మధ్య భక్తి భావనతో, సంప్రదాయ సాంస్కృతిక ఉత్సాహంతో నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

ఉసిరిక చెట్ల వద్ద ప్రత్యేక పూజ, దీపారాధన చేపట్టారు. అనంతరం వాసవి మాత చిత్రపటానికి పూజలు చేసి సమాజ శ్రేయస్సు, సుఖశాంతుల కోసం ప్రార్థనలు చేశారు.  మహిళలు,ఆటపాటలు, కోలాటాలు, పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. భక్తి, సంప్రదాయం, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ కార్తీక వనభోజన మహోత్సవం మండల వ్యాప్తంగా విశేష ప్రచారం పొందింది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల గిర్ధవరి వసంత, ఆర్యవైశ్య సంఘం నాయకులు యాదయ్య, విజయ్ కుమార్, కృష్ణ మూర్తి, సుధాకర్, శ్రీనివాసులు, నాగేష్, చంద్ర మౌళి, భాస్కర్, రాఘవేందర్, రవికుమార్, రమేష్  తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -