హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘కె- ర్యాంప్’. ఇది ఆయన హీరోగా నటిస్తున్న 11వ చిత్రం. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కిరణ్ అబ్బవరం లుంగీ కట్టులో మాస్, క్లాస్ కలిసిన మేకోవర్‌లో ఆకట్టుకుంటున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మందు బాటిల్స్‌తో డిజైన్ చేసిన లవ్ సింబల్ కనిపిస్తోంది. ఈ సినిమా కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ ఏడాది దీపావళి పండగ నేపథ్యంలో ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది అని చిత్ర యూనిట్ తెలిపింది. కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ – బ్రహ్మ కడలి, యాక్షన్ – పథ్వీ, ఎడిటర్ – ఛోటా కె ప్రసాద్, డీవోపీ – సతీష్ రెడ్డి మాసం, మ్యూజిక్ – చేతన్ భరద్వాజ్, కో-ప్రొడ్యూసర్-బాలాజీ గుట్ట, ప్రొడ్యూసర్ – రాజేష్ దండా-శివ బొమ్మకు, రచన, దర్శకత్వం – జైన్స్ నాని.
దీపావళి కానుకగా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES