Monday, April 6, 2026
E-PAPER
Homeసినిమాశక్తివంతమైన గోండ్‌ మహిళగా..

శక్తివంతమైన గోండ్‌ మహిళగా..

- Advertisement -

రష్మిక మందన్న లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న ఫీమేల్‌ -సెంట్రిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మైసా’. దర్శకుడు రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. రష్మిక పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌.
ఈ పోస్టర్‌లో రష్మిక గాయాలతో నిండిన, యుద్ధం చేసినట్లుగా కనిపించే లుక్‌లో కనిపిస్తోంది. ఆమె ముఖం మీద మట్టి, పొగ, రక్తపు మరకలు కనిపి స్తుండగా, ముక్కు, చెంపలు, నుదుటిపై ఉన్న గాయాలు ఆమె పాత్ర ఎదు ర్కొన్న క్రూరత్వాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. అయినప్పటికీ, ఆమె కళ్లలో కనిపించే ఆగ్రహం, తీవ్రత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆ పాత్రకు అవసరమైన రా ఫెరోసిటీని అద్భుతంగా ప్రతిబింబిస్తోంది. గోండ్‌ తెగల సాంస్కతిక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మికను ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా, ఓ శక్తివంతమైన గోండ్‌ మహిళగా కనిపించనున్నారు. ఎమోషన్స్‌, హై-ఆక్టేన్‌ యాక్షన్‌ మేళవింపుతో, ఈ చిత్రం పాన్‌-ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేష్‌ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -