చిరంజీవి నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ సంవత్సరం మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రాలలో ఒకటి. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన పోస్టర్లు, విజువల్ వండర్ టీజర్, ఆధ్యాత్మికంగా నిండిన ఫస్ట్ సింగిల్-రామరామతో భారీ అంచనాలను పెంచింది. యువీ క్రియేషన్స్ విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రంలో త్రిష కష్ణన్ హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. త్రిషకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ చిత్రంలోని ఆమె పాత్రని అవనిగా పరిచయం చేశారు. రాజసం ఉట్టిపడే చీరకట్టులో మెరిసిపోతు కనిపించారు త్రిష. ఈ పోస్టర్‌కి ట్రమండస్ రెస్పాన్స్ వస్తోంది. వశిష్ఠ విజన్, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న విశ్వంభర పురాణ గాథలను మోడరన్ సినిమాతో బ్లెండ్ చేస్తోంది. హై క్వాలిటీ విజువల్స్, బడ్జెట్, అద్భుతమైన కథ ప్రేక్షకులకు విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్‌ని అందించబోతోంది. ఈ చిత్రంలో ఆశికా రంగనాథ్ మరో హీరోయిన్‌గా నటిస్తుండగా, కునాల్ కపూర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి డీవోపీ: చోటా కె నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్ ప్రకాష్.