- Advertisement -
నవతెలంగాణ మక్తల్ : నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశా వర్కర్లు నేడు సిఐటియు ఆధ్వర్యంలో మక్తల్ ఆర్ఎంపి గెస్ట్ హౌస్ నుండి ర్యాలీ నిర్వహించారు. అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. ప్రస్తుత జరుగుతున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఆశా వర్కర్లకి 18 వేల వేతనం పెంచాలని సిఐటియు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆశా వర్కర్లు తరలి వచ్చి మంత్రి వాకిటి శ్రీహరి ఇల్లు ముట్టడికి యత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

- Advertisement -



