- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వనపర్తి జిల్లా వీపనగండ్ల (M)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఇంటి నుంచి అదృశ్యమైన మహిళ శవమై కనిపించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కొమ్ము పరమేష్ భార్య పార్వతి (40) గ్రామంలో ఆశా వర్కర్ గా పనిచేస్తోంది. సోమవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన పార్వతి తిరిగిరాకపోవడంతో భర్త పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అయితే బుధవారం గ్రామానికి సమీపంలోని ఓ బావిలో పార్వతి శవమై కనిపించినట్లు పోలీసులు తెలిపారు
- Advertisement -



