నవతెలంగాణ – అశ్వారావుపేట: మార్చి 2025 విద్యాసంవత్సరం లో 10 వతరగతి పబ్లిక్ పరీక్షలలో అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులు తమ సత్తా చాటారు. మొత్త 97 మంది విద్యార్ధులు పరీక్షలు వ్రాయగా 97 మంది విద్యార్ధులు ఉత్తీర్ణత చెంది నూరు శాతం ఫలితాలను సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత తెలిపారు. 574 మార్కులు సాధించి కె.కీర్తి శ్రీ పాఠశాల ప్రధమ స్థానంలో నిలువగా 570 మార్కులతో అలేఖ్య ద్వితీయ స్థానంలో నిలిచింది. 500 మార్కులు దాటిన వారు 46 మంది ఉండగా ఆంగ్లంలో 550 మార్కులు పైగా సాధించినవారు 16 మంది ఉన్నట్లు ఆమె తెలిపారు. ప్రధమ ,ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్ధిని లను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
పదిలో అశ్వారావుపేట ప్రభుత్వ పాఠశాల హవా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES