Tuesday, December 23, 2025
E-PAPER
Homeబీజినెస్ఏషియన్ పెయింట్స్ ‘అపెక్స్ అల్టిమా ప్రొటెక్’ క్యాంపెయిన్

ఏషియన్ పెయింట్స్ ‘అపెక్స్ అల్టిమా ప్రొటెక్’ క్యాంపెయిన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వాతావరణ పరిస్థితులు ఏడాది పొడవునా ఇళ్లను సవాలు చేస్తున్న సమయంలో ఏషియన్ పెయింట్స్ తన కొత్త ‘అపెక్స్ అల్టిమా ప్రొటెక్’ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. భారతదేశపు చెస్ దిగ్గజాలు విశ్వనాథన్ ఆనంద్, గుకేష్ దొమ్మరాజులతో కూడిన ఈ బ్రాండ్ సైన్స్, వ్యూహం, కథ చెప్పడంలో మిళితం చేసి దాని తాజా పురోగతిని హైలైట్ చేస్తుంది. గ్రాఫేన్ శక్తితో కూడిన ఇది మూడు అంశాలను వినూత్నంగా పరిచయం చేస్తోంది. ఈ కొత్త యాడ్ ఫిల్మ్‌లో ఆనంద్, గుకేశ్ ఇద్దరూ సరదాగా మేథస్సుతో కూడిన చెస్ పోరులో కనిపిస్తారు. వీరి సంభాషణ ద్వారా గ్రాఫిన్ టెక్నాలజీతో శక్తివంతమైన అపెక్స్ అల్టిమా ప్రొటెక్ ఎలా గ్రాండ్ మాస్టర్ ఆఫ్ టఫ్ ప్రొటెక్షన్ పని చేస్తుందో చూపిస్తున్నారు. 

 ‘గ్రాఫిన్’ ఆధునిక శాస్త్రంలో అత్యంత బలమైన, వైవిధ్యమైన పదార్థాల్లో ఒకటి. ఈ ఉత్పత్తి లామినేషన్ సిస్టమ్‌ను మరింత దృఢంగా చేస్తోంది. దీంతో అపెక్స్ అల్టిమా ప్రొటెక్ట్ దక్షిణ భారత ఇళ్లకు బాహ్య గోడల రక్షణలో కొత్త ప్రమాణాలు సృష్టించింది. 12 సంవత్సరాల పని తీరు వారంటీతో వచ్చే ఈ పెయింట్ వర్షం, ఎండ, తేమ, ధూళి వంటి కఠిన వాతావరణ పరిస్థితులకు అత్యుత్తమ ప్రతిఘటనను అందిస్తుంది. ఈ ప్రచారం చెస్‌లో రక్షణ కోసం అవసరమైన వ్యూహాత్మక మేధస్సును దక్షిణ భారత ఇళ్లకు అవసరమైన తెలివైన రక్షణతో పోలుస్తూ చూపిస్తుంది.

ఈ సందర్భంగా ఏషియన్ పెయింట్స్ ఎండీ, సీఈఓ అమిత్ సింగల్ మాట్లాడుతూ ఆవిష్కరణ అనేది ఏషియన్ పెయింట్స్‌లో మనం రూపొందించే ప్రతి ఉత్పత్తికి మూలమన్నారు. గ్రాఫిన్ ఆధారిత రక్షణ వైపు అడుగు వేయడం, ఎక్స్‌టీరియర్స్ విభాగంలో ఒక పెద్ద ముందడుగు అన్నారు.  విశ్వనాథన్ ఆనంద్, గుకేష్ దొమ్మరాజులు ఈ క్యాంపెయిన్‌లో చెస్ బోర్డు నుంచి మీ ఇల్లు గోడల వరకు ‘స్ట్రాటజిక్, ఇంటెలిజెంట్ డిఫెన్స్’ అనే ఆలోచనకు ప్రాణం పోసే విధంగా కాన్సెప్ట్‌ను రూపొందించామన్నారు. పర్ఫెక్ట్ మూవ్‌ను సృష్టించేందుకు ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు ఒకే వేదికపైకి వచ్చినట్లు ఈ కమ్యూనికేషన్ సూచిస్తుందని తెలిపారు.

 ఈ సందర్భంగా ఒగిల్వీ ఇండియా చీఫ్ క్లయెంట్ ఆఫీసర్ బీ రామనాథన్ మాట్లాడుతూ ఈ ప్రచారంలో విశ్వనాథన్, గుకేశ్ చెస్ ఆటలోనూ, ఇళ్ల రక్షణలోనూ ‘డిఫెన్స్‌’ ఎంత ముఖ్యమో చెప్పిన తీరు చాలా బలంగా పని చేస్తోందన్నారు. వీరి కెమిస్ట్రీ గ్రాఫిన్ శక్తిని సులభంగా, ఆకర్షణీయంగా చూపిస్తుందన్నారు. దీంతో ఏషియన్ పెయింట్స్ అపెక్స్ అల్టిమా ప్రొటెక్  నిజమైన గ్రాండ్‌మాస్టర్ ఆఫ్ హోం ప్రొటెక్షన్గా నిలుస్తుందన్నారు. ఈ ప్రచారంతో ఏషియన్ పెయింట్స్ ప్రపంచ స్థాయి సాంకేతికతను మన సంస్కృతికి అనుసంధానమైన కథనంతో మిళితం చేస్తూ దక్షిణ భారత ఇళ్ల కోసం అత్యంత బలమైన, తెలివైన రక్షణను అందించే దిశగా తమ నూతన ఆవిష్కరణలను మరింత విస్తరించిందని తెలిపారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -