- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీలోని పవన్ ఖేడా నివాసానికి అసోం పోలీసులు వచ్చారు.ఈక్రమంలో పవన్ ఖేడా నివాసానికి వెళ్లేటప్పటికి ఆయన అక్కడ లేకపోవడంతో.. వారు ఆయనకోసం ఎదురుచూస్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణికి 3 దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, దీంతోపాటు ఆమె ఆస్తులను ఆయన అఫిడవిట్‌లో వెల్లడించకుండా దాచి పెట్టారని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా(Pawan Khera) ఆరోపించిన విషయం తెలిసిందే. పవన్ ఖేడా తనపై తప్పుడు ఆరోపణలు చేశారని హిమంత సతీమణి రిణికి భూయాన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
- Advertisement -



