Thursday, March 12, 2026
E-PAPER
Homeజాతీయంజమ్మూ కాశ్మీర్ మాజీ సీఎంపై హత్యాయత్నం

జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎంపై హత్యాయత్నం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాపై బుధవారం రాత్రి జమ్మూలోని రాయల్ పార్క్‌లో జరిగిన ఒక వివాహ వేడుకలో హత్యాయత్నం జరిగింది. కమల్ సింగ్ జామ్వాల్ అనే 65 ఏళ్ల వ్యక్తి, ఫరూక్ అబ్దుల్లాను సమీపం నుంచి గన్‌తో కాల్చేందుకు ప్రయత్నించాడు. అయితే, చివరి నిమిషంలో ఆయన భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతను గత 20 ఏళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పినట్లు తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -