- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలుకానుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం పోలింగ్ తేదీలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు సాయంత్రం 4 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరిల్లో ఎన్నికలు ఈసారి నిర్వహించనున్నారు. ఈ శాసనసభల పదవీకాలం మే, జూన్‌లలో వేర్వేరు తేదీల్లో ముగియనుంది. ఈ రాష్ట్రాల్లో ఇప్పటికే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ ముగిసింది. తుది ఓటర్ల జాబితాలను ప్రచురించారు.
- Advertisement -



