- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)ను సందర్శించిన తొలి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. యాక్సియం-4 మిషన్ శిక్షణలో భాగంగా శుక్లా గతేడాది అమెరికాకు వెళ్లారు. మిషన్ విజయవంతం తర్వాత తొలిసారి భారత్‌కు వచ్చిన శుక్లాకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అక్కడి సీఎం రేఖా గుప్తా స్వాగతం పలికారు. ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో శుభాంశు శుక్లా పాల్గొననున్నారు.
- Advertisement -